చిరు క్లాప్ తో శ్రీకాంత్ 'మహాత్మ'
కృష్ణవంశీతో మినహా పరిశ్రమకు చెందిన పెద్ద డైరెక్టర్లందరితోనూ తాము పని చేశామని, కృష్ణవంశీతో తమకిది తొలి చిత్రమని పరుచూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఇతరులను గౌరవించడం, వారి అభిప్రాయాలకు విలువనివ్వడం కృష్ణవంశీలో కనిపిస్తుందని అన్నారు. రాజకీయాల నాయకులంతా ఒకేసారి జనం ముందుకు వస్తుండటంతో ఎవరిని నమ్మాల్లో తెలియక జనం అయోమయంలో పడిపోతున్నారనీ, అలాంటి వారికి సందేశాన్నిచ్చే సినిమా మహాత్మ అవుతుందన్నారు. రాష్ట్రానికో మహాత్మ కావాలని తెలియజెప్పే చిత్రమిదని అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ, దర్శకుడిగా కృష్ణవంశీ అంటే తనకు ఎంత ఇష్టమనీ, తన వందవ సినిమాకు దర్శకత్వం వహించాల్సిందింగా రెండేళ్లుగా ఆయనను కోరుతున్నాననీ చెప్పారు. అద్భుతమైన స్టోరీని ఆయన ప్రిపేర్ చేశారనీ, తన కెరీర్ లోనే ఓ మైలురాయిగా ఈ చిత్రం నిలిచిపోతుందనీ అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిరంజీవి, దసరి, కె.రాఘువేంద్రరావు, డాక్టర్ డి.రామానాయుడు తదితరలకు తన కృతజ్ఞతలు తెలిపారు. మంచి టీమ్ తో సినిమా తీస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్మాత మనోహర్ పేర్కొన్నారు.
శ్రీకాంత్ సరసన భావన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి సోదరులు సంభాషణలు అందిస్తున్నారు. శరత్ సినిమాటోగ్రఫీ, శ్రీనివాసరాజు కళాదర్శకత్వం, ధరన్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|