చిన్నా డైరెక్షన్ లో 'ఆ ఇంట్లో'
నటుడు చిన్నా దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో 'నా ఇంట్లో' అనే చిత్రం లాంకోహిల్స్ సమీపంలోని మనికొండ వద్ద ఆదివారంనాడు ప్రారంభమైంది. మయూరి (ఆశా షైనీ), దేవన హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిన్నా, మయూరిపై చిత్రీకరించిన ముహార్తం సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇ్చచారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కెమరా స్విచ్చాన్ చేశారు. కె.ఎస్.రామారావు గౌరవ దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ స్ట్రిప్టు అందజేశారు.
చిన్నా మాట్లాడుతూ, యు-9 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోందనీ, తాను దర్శకత్వం వహిస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ఇది ఒక హారర్ ఫిల్మ్ అని చెప్పారు. తన భార్యగా మయూరి నటిస్తోందన్నారు. ఏకబిగిన 46 రోజుల పాటు జరిపే సింగిల్ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేస్తామని నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందులో తాను ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నానని మయూరి చెప్పగా, థియేటర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి తాను వచ్చాననీ, అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ లో నటనలో శిక్షణ పొంది మోడిలింగ్ కూడా చేశాననీ, తెలుగులో తనకిది తొలి చిత్రమనీ దేవన పేర్కొంది. ఈ చిత్రానికి కోటి సంగీతాన్ని అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|