హనీషా మూవీస్ ప్రేమకథ
శేఖర్, విమలారామన్ జంటగా నూత నిర్మాణ సంస్థ హనీషా మూవీస్ ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఎ.పి.రవికాంత్ దర్శకత్వంలో ఎం.శ్రీనివాసరాజు, జ్యోతి రవీద్రం, పి.శ్రీనివాసలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకనిర్మాత సాగర్ క్లాప్ ఇచ్చారు.
ఇది ఒక రొమాంటిక్ ప్రేమకథా చిత్రమనీ, తల్లిండ్రుల కారణంగా విడిపోయిన ప్రేమజంట తిరిగి ఎలా కలుసుకుందనే ఇతివృత్తంతో ఈ చిత్రం ఉంటుందనీ దర్శకుడు తెలిపారు. ఒక సామాన్య వ్యక్తి నాయకుడిగా ఎలా ఎదిగాడనేది కూడా ఈ చిత్రంలోని కీలకాంశమని అన్నారు. ఇది తమ తొలి చిత్రమనీ, ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నామనీ నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాసరాజు తెలిపారు. 'హరి ఓం' తర్వాత తనకిది రెండో చిత్రమని హీరో శేఖర్ పేర్కొనగా, ఈ చి్తరంలో తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని విమలా రామన్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, జయసుధ, డాక్టర్ శివప్రసాద్, తనికెళ్ల భఱణి, బ్రహ్మానందం, ధర్మవరపు, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్, ఆలి, జయప్రకాష్ రెడ్డి, అజయ్ తదితరులు నటిస్తున్నారు. వేటూరి, చంద్రబోస్, చిన్ని చరణ్ పాటలు, రామణరాజు సినిమాటోగ్రఫీ, చిన్ని చరణ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|