'బ్రేక్ ఇన్ డాన్స్ అకాడమి'
'స్వాగతం', 'సవాల్', 'బ్రహ్మాస్త్రం', 'మిస్టర్ గిరీశం', 'అడుగు' వంటి పలు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన రమేష్ నృత్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం హైద్రాబాద్ లోని కృష్ణానగర్ లో 'బ్రేక్ ఇన్ డాన్స్ అకాడమీ' పేరుతో ఓ డాన్స్ స్కూల్ ను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి.విష్ణువర్దన్ రెడ్డి చేతుల మీదుగా ఈ డాన్స్ స్కూల్ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు సాగర్, వి.ఈశ్వర్ రెడ్డి, 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' దర్శకుడు కిషోర్ కుమార్, హీరోలు భూషణ్, సమరేంద్రనాథ్, నిర్మాత సుధాకర్ రెడ్డి, డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడింట్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి రాముడు, ట్రెజరర్ అనిల్ రెడ్డి, ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ యాదవ్, కాచిగూడ వైశ్య హాస్టల్ ట్రెజరర్ జయరాములు గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డాన్స్ మాస్టర్ రమేష్ మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసి అనుభవంతో ఈ డాన్స్ అకాడమీని ప్రారంభించాననీ, 3 నెలల పాటు శిక్షణనిచ్చే ఈ కోర్సులో వెస్ట్రన్, క్లాసికల్, ఫోక్ డాన్స్ నేర్పిస్తామనీ అన్నారు. డాన్స్ నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న వికలాంగులకు ఎలాంటి ఫీజు లేకుండా శిక్షణ ఇస్తామని చెప్పారు. సాగర్ మాట్లాడుతూ, గతంలో మనకు కొరియోగ్రాఫర్ల కొరత ఉందేదనీ, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఎంతోమంది కొరియోగ్రాఫర్లు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని అన్నారు. ఈ ఐదేళ్లలో డాన్సర్స్ అసోసియేషన్ కూడా బాగా పుంజుకుందని అన్నారు. రమేష్ మంచి ఉద్దేశంతో ప్రారంభించిన డాన్స్ అకాడమీ తప్పకుండా సక్సెస్ అవుతుందన్నారు. దర్శకుడు కిషోర్ కుమార్ (డాలీ) మాట్లాడుతూ, టాలెంట్ ఉన్న కొరియోగ్రఫర్స్్ని డైరెక్టర్లు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారనీ, టీవీల్లో వస్తున్న డాన్స్ షోలతో యూత్ లో నేర్చుకోవాలనే ఉత్సాహం పెరిగిందన్నారు. రమేష్ ప్రయత్నం తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|