వెంకీ-వైట్ల సినిమా మార్చిలో
ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తూ వస్తున్న విక్టరీ వెంకటేష్ 'చింతకాయల రవి' తర్వాత మళ్లీ కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. కొద్దికాలంగా కథా చర్చల్లో ఉన్న వెంకటేష్ ఇప్పటికే దర్శకుడు క్రిష్ ('గమ్యం' ఫేమ్ ), శ్రీనువైట్లతో పని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'కృష్ణం వందే జగద్గురుం' పేరుతో క్రిష్ ఓ స్క్రిప్టు కొద్దికాలంగా రెడీ చేస్తున్నారు. మరోవైపు శ్రీనువైట్ల సైతం వెంకటేష్ సినిమాకి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారు. 'డీ', 'దుబాయ్ శీను', 'రెడీ', 'కింగ్ ' వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న శ్రీనువైట్ల ఇప్పటికే ఓ మంచి స్టోరీలైన్ వెంకటేష్ కు చెప్పి ఓకే చేయించుకున్నారు.ఈ చిత్రం మార్చిలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకొని ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుందని సమాచారం.
ఈ చిత్రాన్ని డి.సురేష్ బాబు సమర్పణలో గిరి నిర్మించనున్నారు. వెంకటేష్ కు జోడిగా త్రిష నటించే అవకాశాలు ఉన్నాయి. ఇది పూర్తి వినోదాత్మక చిత్రమనీ, వెంకటేష్ క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉంటుందనీ శ్రీనువైట్ల చెబుతున్నారు. మూడు నెలలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|