వీరశంకర్ 'యువరాజ్యం'
పవన్ కల్యాణ్ తో 'గుడుంబా శంకర్' చిత్రాన్ని తీసిన దర్శకుడు వీరశంకర్ మరో కొత్త చిత్రానికి సన్నద్ధమవుతున్నారు. దీనికి 'యువరాజ్యం' అనే టైటిల్ ను ప్రకటించారు. ఆసరా నిర్మాణ్ ఇండియా పతాకంపై హెచ్.ఎస్.హరూన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
యువశక్తి గొప్పతనం, వారి కనీస హక్కులను మరొకరు దోచుకుంటూ పోతే వారి స్పందన ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు వీర శంకర్ తెలిపారు. ఈ చిత్రాన్ని తాను సొంతంగా నిర్మించాలని అనుకున్నప్పటికీ స్క్రిప్టు బాగా నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు హరూన్ ముందుకు వచ్చారనీ చెప్పారు. ప్రజారాజ్యంతో సహా ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి కానీ, స్ఫూర్తితో కానీ ఈ సినిమా ఉండబోదని ఆయన వివరణ ఇచ్చారు. ఇందులో 70 శాతం ఆర్టిస్టులందరూ కొత్త వారేనని తెలిపారు. ఈనెల 27న షూటింగ్ ప్రారంభించి మే నెలలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|