కైరో ఫెస్టివల్ కు 'ఘటోత్కజ'
తెలుగు సినిమాకు సమాంతరంగా 75 ఏళ్లు పైబడిన దిగ్దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన తీసిన సినిమాల్లో చిన్నపిల్లలకు అహ్లాదం కలిగించేవి చాలానే ఉన్నాయి. 'పుష్పక్ ', 'అప్పు రాజా', 'భైరవ ద్వీపం', 'అదిత్య 369' వంటివి ఈ కోవలేనివే. ఇటీవలే ఆయన అలనాటి 'మాయాబజార్' లోని ఘటోత్కచుడి పాత్రతో 'ఘటోత్కజ' అనే 3డి యానిమేషన్ చిత్రాన్ని పిల్లలకు కానుకగా ఇచ్చారు. సింగీతం సూర్యదేవర వినోద్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్తోంది. బాలల చిత్రాల విభాగంలో ప్రదర్శనకు ఈ సినిమా నామినేట్ అయింది. మార్చి 5 నుంచి 12వ తేదీ వరకూ కైరో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనుంది.
ఫిల్మ్ ఫెస్టివల్ కు సినిమా ఎంపిక కావడం, తనను ఆహ్వానించడం ఎంతో సంతోషం కలిగించినట్టు సింగీతం తెలిపారు. ఇది యానిమేటెడ్ చిత్రమే అయినా వయోభేదం లేకుండా అందర్నీ అలరించే యూనివర్శల్ స్ట్రిప్టని ఆయన అన్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అనీ, ఒరిజినల్ క్లాసిక్ మైథాలజీని చాలాకాలం తర్వాత చూపించడంతో జనం బాగా ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. ఇండియాలోని 7 భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేశారు. తాజాగా సింగీతం శ్రీనివాసరావు ప్రముఖ వాగ్గేయకారుడు 'త్యాగయ్య ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|