కామెడీగా 'గాలి శీను'
'గమ్యం' సినిమాలో అల్లరి నరేష్ పోషించిన గాలి శీను పాత్ర ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పాత్ర పేరుతోనే 'గాలి శీను' అనే చిత్రం రూపొందింది. పోసాని కృష్ణ మురళి ప్రత్యేక పాత్రలో, ఆర్.కె., సత్యకృష్ణన్ ప్రధాన పాత్రధారులుగా స్వప్న మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పి.ఉదయ్ భాస్కర్ దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు బుధవారంనాడు సంస్థ కార్యాలయంలో చిత్రయూనిట్ తెలియజేసింది.
గుండాయిజం చేసే ఓ దాదా సినిమాల్లో నటించాలని అనుకుంటాడనీ, ఈ నేపథ్యంలో అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయనేది ఇందులో వినోదభరితంగా చూపించనున్నామనీ దర్శకుడు తెలిపారు. మామ పాత్ర ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆర్.కె. ఇందులో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా, పోసాని ఎం.ఎల్.ఏ.గా నటించినట్టు చెప్పారు. వినోదంతో కూడిన కమర్షియల్ అంశాలన్నీ ఇందులో ఉంటాయనీ, ముమైత్ ఖాన్ సాంగ్ హైలైట్ అవుతుందని చెప్పారు. ఇందులోని తన పాత్రకు మూడు, నాలుగు షేడ్స్ అంటాయని ఆర్.కె. తెలిపారు. ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చిందనీ, మార్చిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ నిర్మాతల్లో ఒకరైన ఎం.వి.కృష్ణప్రసాద్ తెలిపారు. సంగీత దర్శకుడు అర్జున్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో 'చిత్రం' భాషా, మోనికా, సాజిత్, మాస్టర్ శివవర్మ తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|