'మగధీర'కు అంతరాయం
రామ్ చరణ్ తేజ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్ పతాకంపై అల్లు అరవింద్ భారీ ఖర్చుతో నిర్మిస్తున్న 'మగధీర' చిత్రం షూటింగ్ కు అంతరాయం తలెత్తనట్టు తెలిసింది. ఈ చిత్రం కోసం కొన్ని కీలకమైన ఫైట్స్ ను ప్రస్తుతం హైద్రాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో కొన్ని రిస్కీ ఫైట్స్ ను ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఫైట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఊహించని విధంగా పీటర్ హెయిన్స్ గాయపడినట్టి తెలిసింది. దీంతో ఆయనను తొలుత కామినేని ఆసుపత్రికి, ఆ తర్వాత కిమ్స్ కు తరలించారు. దీంతో షూటింగ్ కు బ్రేక్ పడినట్టు యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.
రామచరణ్ ఇందులో పలు రిస్కీ ఫైట్స్ కూడా చేస్తున్నారు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలతో పాటు ఇటీవల సింహాలతో కూడా ఆయన తలపడే సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. పునర్జన్మల కథాంశంతో ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడిగా కాజల్ నటిస్తోంది. మార్చి ప్రథమార్థంలో ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని భారీ ప్రింట్లతో విడుదల చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|