'సత్యమేవజయతే' సక్సెస్
జీవిత దర్శకత్వంలో తాను కథానాయకుడిగా నటించిన 'సత్యమేవ జయతే' మంచి చిత్రంగా అందరి ఆదరాభిమానాలు చూరగొంటోందని డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో శివానీ శివాత్మిక మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైద్రాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో రాజశేఖర్ దంపతులు గురువారంనాడు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
సినిమా చూసిన వాళ్లంతో ముక్తకంఠంతో బాగుందని అంటున్నారనీ, 70 శాతం కలెక్షన్లు ఉన్నాయనీ రాజశేఖర్ తెలిపారు. టాక్ బాగున్నా కలెక్ష్లన్లు ఎందుకు తక్కువగా ఉన్నాయో అర్ధం కావడం లేదని అన్నారు. చాలామటుకు మిగిలిన చిత్రాల పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారని చెప్పారు. 'ఎవడైతే కేంటి చిత్రాన్ని కూడా ఇదే సమయంలో విడుదల చేశాం. అందువల్ల రాంగ్ పీరియడ్ అనడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. ఓ మంచి పోలీస్ ఆఫీసర్ సినిమా తీయాలని రెండు సంవత్సరాలు కష్టపడ్డాం. లాభాల కోసం సినిమా చూడమని కోరడం లేదు. ఓ మంచి సినిమాను చూడమని ప్రేక్షకులను కోరుతున్నాం. సినిమాలో ముస్లింల దేశభక్తిని చూపించాం. సినిమా విడుదలైన తర్వాత ముస్లిం సంఘాలు ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. ఇలాంటి భారీ యాక్షన్ సినిమాను మహిళా దర్శకురాలు
చేయడం కూడా అందరి ప్రశంసలు అందుకుంటోంది' అని చెప్పారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలనే ఇందులో చూపించామని, ప్రజలను కాపాడాల్సిన రాజకీయ నాయకులే సరిగా లేకపోతే పోలీసులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే పాయింటును ఇందులో ఆవిష్కరించామనీ జీవిత తెలిపారు. ఇంతవరకూ తాను దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో ఈ సినిమాకి చాలా బాగా పేరొచ్చిందని చెప్పారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|