'మిత్రుడు'గా బాలకృష్ణ
యువరత్న బాలకృష్ణ, అందాల నటి ప్రియమణి జంటగా వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'మిత్రుడు' అనే టైటిల్ ను ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడు మహేదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కథకు అనుగుణంగానే ఈ టైటిల్ ను నిశ్చయించామనీ, అందరికీ ఇష్టమైన టైటిల్ ఇదనీ కృష్ణ ప్రసాద్ తెలిపారు.
చిత్రం ప్రోగ్రస్ ను వివరిస్తూ, ఈనెల 9న హైద్రాబాద్ లో ఆఖరి షెడ్యూల్ ప్రారంభించామనీ, మార్చి 2 నుంచి 5 వరకూ తమిళనాడులోని కుంభకోణంలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణతో ఒక పాట మినహా సినిమా మొత్తం పూర్తవుతుందన్నారు. ఆ పాటను బాలకృష్ణ, ప్రియమణిపై చిత్రీకరిస్తామని చెప్పారు. మార్చి రెండో వారంలో లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో, ఏప్రిల్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేసినట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్ోల చంద్రమోహన్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, బాలయ్య, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, జయప్రకాష్ రెడ్డి, హేమ, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ, ఎం.రత్నం మాటలు, బాలమురుగన్ సినిమాటోగ్రఫీ, కోలా భాస్కర్ ఎడిటింగ్, ఆనంద్ సాయి ఆర్ట్, రమారాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైనింగ్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|