సాయికిరణ్ 'కర్మ' ప్రారంభం
'వినాయకుడు' చిత్ర దర్శకుడు సాయికిరణ్ అడవి సమర్పణలో 'కర్మ' (డు యు బిలీవర్) అనే తెలుగు చిత్రం రూపొందనుంది.అడివి శేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాలిఫోర్నియాలోని శివ విష్ణు మందిరంలో వసంత పంచమి రోజున గణపతి హోమంతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రం షూటింగ్ కు ముందే యాడ్ ల్యాబ్స్ ఇన్ కార్పొరేషన్ సంస్థ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తీసుకోవడం విశేషం.
దర్శకుడు అడివి శేష్ ఈ చిత్రంలో అమెరికా నటి జడే టైలర్, షేర్ అలితో కలిసి నటించనున్నారు. సంగీతానికి సంబంధించి ముగ్గురు అమెరికా సంగీత దర్శకులు, కొత్త తరం సినిమాటోగ్రాఫర్ జేమ్స్ లాక్స్ టన్ ను తెలుగు సినిమాకి పరిచయం చేయబోతున్నారు. రెడ్ 4కె కెమెరా టెక్నాలజీతో, రివల్యూషనరీ థింకింగ్ తో క్యాలిటీ సినిమా అందించేందుకు నిర్మాతలు సాయికిరణ్ అడవి, భవాని అడవి, హరీష్ సింగ్ కృతనిశ్చయంతో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగుసినిమా ప్రతిష్ఠను ఈ చిత్రం ఇనుమడింపజేస్తుందని ఆశిద్దాం.
Be first to comment on this News / Article!
|