10 రూపాయలకే 'మేస్త్రి' సాంగ్స్
దర్శకరత్న దాసరి నారాయణరావు కొద్దికాలం గ్యాప్ తర్వాత మళ్లీ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'మేస్త్రి'. శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ కృష్ణ దర్శకుడు. మోహన్ బాబు ఓ విశిష్ట పాత్రలోనూ, శ్రీహరి మరో కీలక పాత్రలోనూ నటిస్తున్నారు. నేటి సమాజంలో చేటుచేసుకుంటున్న పలు సంఘటనకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉండబోతోంది. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకొన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఆడియోను ఈనెల 23న విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. మైత్రి ఆడియో కంపెనీ ద్వారా హైద్రాబాద్ లో ఆడియో విడుదలవుతుందనీ, మార్చి 6న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు.
ఆడియో సీడీని కేవలం 10 రూపాయలకే అందిస్తున్నామనీ, ఇంత తక్కువ ధరకు అదించడం తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారనీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ముఖ్య నగరాలతో పాటు చెన్నై, బెంగుళూరు, దుబాయ్, సింగపూర్, మలేసియా, యుఎస్ఏ, యుఎఇలలో ఈనెల 23న ఆడియో విడుదలవుతుందన్నారు. 5 లక్షల ఆడియో సీడీలను విడుదల చేస్తున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|