విజయనిర్మల బర్త్ డే
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల శుక్రవారంనాడు తన పుట్టినరోజు వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. నానక్ రామ్ గూడలోని ప్లానెట్ 10 నివాసంలో ఈ వేడుక జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ, నరేష్ ఈ వేడుకలో పాల్గొన్నారు. విజయనిర్మల కేక్ కట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. కృష్ణ, విజయనిర్మల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు శుభాక్షాంక్షలు తెలిపారు. కృష్ణ, విజయనిర్మల, నరేష్ లకు కలిపి భారీ పూలదండ వేసి అభిమానులు సంబరం చేసుకున్నారు.
విజయనిర్మల దర్శకత్వంలో రూపొందుతున్న 'నేరము శిక్ష' షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ పుట్టినరోజు రావడం, ఇది దర్శకరాలిగా ఆమెకు 44వ చిత్రం, నటుడిగా తనకు 333వ చిత్రం కావడంతో విజయనిర్మలకు ఇది గుర్తుడిపోయే పుట్టినరోజని కృష్ణ అన్నారు. కృష్ణగారికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు, పద్మభూషణ్ రావడం, ఇప్పుడు ఆయన సినిమాకు దర్శకత్వం వహిస్తూ 50వ సారి ఆయనకు జంటగా నటిస్తుండటం ఈ పుట్టినరోజు విశేషమని విజయనిర్మల తెలిపారు. తమను ఇంతగా అభిమానించి ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.
Be first to comment on this News / Article!
|