'రాజు-మహారాజు' ఆటాపాటా
డాక్టర్ ఎం.మోహన్ బాబు, శర్వానంద్ కలయికలో శ్రీ కుమార స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న చిత్రం 'రాజు మహారాజు'. పి.భానుశంకర్ దర్శకుడు. రమ్యకృష్ణ, సుర్విన్ ఛావ్లా, తషు కౌశిక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణలో జరుపుకొంటోంది. శర్వానంద్, తషు కౌశిక్ లపై ప్రస్తుతం అన్నపూర్ణా స్టూడియోస్ లో వేసిన సెట్ లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. 'పూచిన పువ్వల్లే' అంటూ సాగే ఈ పాటను నోబుల్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్స్ లోనే చిత్ర యూనిట్ శనివారంనాడు ముచ్చటించింది.
లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ వంటి అంశాలతో అన్ని కమర్షియల్ హంగులు ఉన్న చిత్రంగా ఇది రూపొందుతోందని నిర్మాత తెలిపారు. మోహన్ బాబు ఓ విశిష్టమైన పాత్ర పోషిస్తుండగా, శర్వానంద్ పాత్ర మాస్ ను ఆక్టటుకునే విధంగా ఉంటుందన్నారు. బ్యాలెన్స్ ఉన్న 2 పాటల్లో ఒకటి ఆస్ట్రియాలో, మరొకటి మోహన్ బాబుపై చిత్రీకరిస్తామనీ, దీంతో సినిమా పూర్తవుతుందనీ తెలిపారు. రాజు-మహారాజు ఎవరన్నది చిత్రం చూసి తెలుసుకోవాల్సిందేనని దర్శకుడు భానుశంకర్ అన్నారు. 'గమ్యం' తర్వాత మంచి చిత్రం కోసం ఏడాదికి పైగా ఆగాననీ, ఈ చిత్ర కథ తననెంతో ఆకట్టుకోవడంతో నటించేందుకు అంగీకరించాననీ శర్వానంద్ తెలిపారు. మోహన్ బాబు కాంబినేషన్ లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, చంద్రమోహన్ , ధర్మవరపు, ఎల్బీ శ్రీరాం, రఘుబాబు, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, ఎం.ఎస్.నారాయణ, భరత్ తదితరులు నటించారు. జీవనసత్యం మాటలు, రమేష్ సినిమాటోగ్రఫీ, కోటగిరి ఎడిటింగ్, చక్రి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|