టాలీ 2 హాలీ 'ఆ ఒక్కడు'
అజయ్ కథానాయకుడుగా, మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ప్రత్యేక పాత్రలో టాలీ టు హాలీ ఫిలిమ్స్ నిర్మిస్తున్న చిత్రానికి 'ఆ ఒక్కడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎస్.ఎస్.మూర్తి దర్శకత్వంలో ఇందుకూరి గణపతిరాజు నిర్మిస్తున్నఈ చిత్రం 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో చిత్రయూనిట్ శనివారంనాడు టైటిల్ ను ప్రకటించింది.
పదిమందిలో ఒక్కడిని గుర్తించేటప్పుడు 'ఆ...ఒక్కడు' అంటామనీ, అదే ఈ సినిమా టైటిల్ అనీ ఎస్.ఎస్.మూర్తి, సహ నిర్మాత సుధాకర్ చాగంటి పేర్కొన్నారు. ఈ చిత్రంలో చిన్న థ్రిల్లింగ్ పాయింట్ కూడా ఉంటుందనీ, పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చిత్రం రూపొందుతోందనీ వారు తెలిపారు. అజయ్ పాత్ర రఫ్ గా ఉంటుందనీ, సురేష్ గోపి లాయర్ పాత్ర పోషిస్తున్నారనీ చెప్పారు. హీరోయిన్ మధురిమకు తెలుగులో ఇది తొలి చిత్రమనీ, చక్కటి నటన, గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తుందనీ అన్నారు. ఇందులో ఆరేడు పాత్రలు హైలైట్ గా ఉంటాయన్నారు. సునీ, ధర్మవరపు చక్కటి హాస్యాన్ని పండించారని తెలిపారు.కొద్దిపాటి టాకీ, క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరించాల్సి ఉందనీ, మార్చి 1 నుంచి 10 వరకూ జరిపే షెడ్యూల్ లో ఒక పాట, టాకీ అవుతుందనీ, మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిపే షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందనీ చెప్పారు. మార్చి నెలాఖరులో ఆడియో, ఏప్రిల్ చివర్లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|