ఛార్మి 'సై ఆట'
ఛార్మి కథానాయికగా సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ 'సై ఆట' చిత్రం రూపొందుతోంది. ప్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై 'యమగోల మళ్లీ మొదలైంది' తర్వాత రూపొందుతున్న రెండో చిత్రమిది. కె.ఆర్.పవన్ దర్శకత్వంలో నల్లూరి రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.
పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పక్కా కమర్షియల్ అంశాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని రాజశేఖర్ తెలిపారు. ఛార్మి నటనతో పాటు కోట శ్రీనివాసరావు, అజయ్, నాజర్, శివప్రసాద్, రావురమేష్ వంటి ఆర్టిస్టులు సరికొత్తగా ఈ సినిమాలో కనిపించబోతున్నారని చెప్పారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ అవుతుందన్నారు. మార్చిలో పాటల చిత్రీకరణ పూర్తి చేసి అదే నెల 27న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాతర్ల్లో ప్రభాకర్, ఓంకార్, ఎం.ఎస్.నారాయణ, ఆలీ, చలపతిరావు, మాస్టర్ భరత్ , సుమన్ శెట్టి, గుండు హనుమంతరావు తదితరులు నటిస్తున్నారు. భాషాశ్రీ మాటలు, జి.ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రసాద్ ఫైట్స్ , నందమూరి హరి ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|