మార్పుకోసం 'ఊరికొక ఠాగూర్'
సమాజంలో మార్పు అనివార్యమనే కథాంశంతో 'ఊరికొక ఠాగూర్' చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకనిర్మాత బి.బి.ఆర్.నాయుడు (భాస్కర్ నాయుడు) తెలిపారు. 'ప్రజాతీర్పు', 'అన్నసైన్యం'. 'ఇద్దరు మిత్రులు' వంటి చిత్రాలను ఆయన స్వీయ దర్శకత్వంలో గతంలో నిర్మించారు.గంగోత్రి ఫిలింస్ పతాకంపై ఆయన రూపొందిస్తున్న 'ఊరికొక ఠాగూర్ ' చిత్రం సారథి స్టూడియోస్ లో శనివారంనాడు ప్రారంభమైంది. నిర్మాత గాజుల నాగేశ్వరరావు తనయుడు తిలక్ ఈ చిత్రం ద్వారా ఒక హీరోగా పరిచయవుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చందవోలు శోభారాణి నిర్మాణ సారథిగా వ్యవహరిస్తున్నారు. ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు సాగర్ క్లాప్ ఇవ్వగా, చందవోలు శోభారాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత ఆర్.కె.గౌడ్ గౌరవ దర్శకత్వ వహించారు. మరో నిర్మాత శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు.
నిర్మాత భాస్కర్ నాయుడు మాట్లాడుతూ, అవినీతి రహిత సమాజం కోసం ఊరికో ఠాగూర్ కావాలని చెప్పే చిత్రమిదనీ, ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు ప్రముఖ నటీనటులు ఉంటారనీ, వారు పేర్లు తర్వాత ప్రకటిస్తామనీ చెప్పారు. మార్చి 1 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవతుందన్నారు. గుంటూరు జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో ఒక్కరోజు ఒక్కోచోట షూటింగ్ చేస్తామని చెప్పారు. అనంతరం తెలంగాణాలోని కొన్ని నియోజకవర్గాల్లో షూటింగ్ చేస్తామని చెప్పారు. మొత్తం 40 నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు షూటింగ్ చేసి ఎన్నికల ముందు సినిమా రిలీజ్ చేస్తామన్నారు. సెన్సార్ బోర్టు సభ్యురాలిగా నాలుగైదు సార్లు పనిచేసినట్టు నిర్మాణ సారథి శోభారాణి తెలిపారు.ఈరోజు సమాజానికి ఏది అవసరమే అదే ఈ చిత్రంలో చూపిస్తామన్నారు. ఇందులో 5 పాటలు ఉంటాయనీ, రికార్డింగ్ పూర్తయిందనీ సంగీత దర్శకుడు లక్ష్మీ వినాయక్ చెప్పారు. నూతన నటుడు ఆర్.ఎస్.రెడ్డి, గీత రచయిత విష్ణుశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|