తమన్నా 'ఆనందం తాండవం'
తమన్నా కథానాయికగా ఆస్కార్ ఫిలింస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆస్కార్ వి.రవిచంద్రన్ తమిళ, తెలుగు భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాంధీకృష్ణ దర్శకుడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నారు. తెలుగు వెర్షన్ కు 'ఆనంద తాండవం' అనే పేరును ఖరారు చేశారు. ఆస్కార్ సంస్థ నిర్మించిన 'అపరిచితుడు', 'దశావతారం', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి చిత్రాలను తెలుగులో అందించిన ఎస్.వి.ఆర్. మీడియా సంస్థ ఈ తాజా చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులకు అందిచనుంది. ఈ చిత్రంలో సిద్దార్ధ అనే యువకుడు హీరోగా పరిచయమవుతున్నారు. తమిళ నటి రుక్మిణి మరో హీరోయిన్ గా నటిస్తోంది.
రచయిత్రి సుజాత రాసిన నవల ఆధారంగా 'ఆనంద తాడవం' చిత్రం తెరకెక్కిందని నిర్మాత రవిచంద్రన్ తెలిపారు. విదేశాల్లో సెటిల్ కావాలనే మోజులో పడి కొట్టుమిట్టాడుతున్న యువతకు కన్నువిప్పు కలిగించే కథాంశమిదని చెప్పారు. ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడైన గాంధీకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారని తెలిపారు. అలాగే ఎ.ఆర్.రెహమాన్ కజిన్ జి.వి.ప్రకాష్ కుమార్ మంచి మ్యూజిక్ ఇచ్చారనీ, సోనీ బిఎంజి ద్వారా మార్చి ఫస్ట్ వీక్ లో ఆడియో రిలీజ్ అవుతుందనీ అన్నారు. ఇందులోని పాటలన్నీ ఒక్కో పాటకు ఓక్కో డాన్స్ మాస్టర్ తో చాలా రిచ్ గా తీశామనీ, 90 రోజుల పాటు అమెరికాలోనూ, మరో 50 రోజులు కులుమనాలి, కొడైకెనాల్, ఊటీలలో షూటింగ్ జరిపామనీ చెప్పారు. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి శశాంక్ వెన్నెలకంటి మాటలు, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, వనమాలి పాటలు, జీవాశంకర్ సినిమాటోగ్రఫీ, పద్మశ్రీ తోటతరణి కళాదర్శకత్వం, వి.టి.విజయన్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|