నిర్మాతల వెల్ఫేర్ కమిటీ
పెర్సంటేజ్ విధానం అమలు, 35 ప్రింట్ల లోపు సినిమాలకు పన్ను రద్దు చేయాలనే డిమాండ్ తో ఇటీవల నిరాహార దీక్ష చేసిన పలువురు నిర్మాతలు ఇంతవరకూ ఎలాంటి ఉత్వర్వులు వెలువడక పోవడం పట్ల ఆందోళన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన కోర్కెల సాధనకు గాను 'నిర్మాతల వెల్ఫేర్ ' కమిటీని సోమవారంనాడు ఏర్పాటు చేసుకున్నారు.
ఈ కమిటీకి చదలవాడ శ్రీనివాసరావు అధ్యక్షులుగా, విజయ్ చందర్, మోహన్ గౌడ్, నటికుమార్, ఆర్.కె.గౌడ్, జ్యోతిప్రసాద్, సాయివెంకట్, దశరథ, కేశవరావు, రమేష్ నాయుడు, జి.శంకర్ గౌడ్, విజయవర్మ, ఎస్.వి.రావు, కృష్ణారెడ్డి, రాజేష్, రామసత్యనారాయణ, బాబ్జి, ముత్యాల రాందాసు, పులి అమృత సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరితో చదలవాడ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. 25వ తేదీలోగా చాంబర్ నుంచి ఎలాంటి ఉత్వర్వులు రాకుంటే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించారని వారు తెలియజేశారు. వెల్ఫేర్ కమిటీ ఏర్పాటుకు 200 మంది నిర్మాతల మద్దతు ఉన్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|