రామ్ చరణ్ రెస్ట్
'చిరుత' కథానాయకుడు రామ్ చరణ్ తేజ కాలికి తగిలిన గాయంతో ఇంట్లోనే ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'మగధీర' చిత్రం షూటింగ్ లో ఇటీవల ఆయన కాలికి గాయమైంది. పునర్జన్మల కథాంశంతో రామ్ చరణ్ ను డైనమిక్ హీరోగా ఇందులో రాజమౌళి చూపించబోతున్నారు. ఇందులో కొన్ని రిస్కీ ఫైట్స్ ను కూడా రామ్ చరణ్ చేస్తున్నారు. ఇలాంటి ఓ సందర్భంగాలోనే గాయపడిన రామ్ చరణ్ 'గాయం చిన్నదే. స్పీడ్ గానే రికవర్ అవుతున్నాను' అంటూ చెబుతున్నారు. తన విశ్రాంతి సమయాన్ని క్లాసికల్ మూవీస్ చూస్తూ కుటుంబ సభ్యులకు కేటాయిస్తున్నారు.
రామ్ చరణ్ గాయపడటానికి ముందే మరో ప్రమాదం కూడా షూటింగ్ లో చేటుచేసుకుంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ కొన్ని కీలకమైన స్టంట్ సన్నివేశాలకు రిహార్సల్స్ చేస్తుండగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. హిందీ 'గజనీ' చిత్రం సమయంలోనూ ఇలాంటి ప్రమాద సంఘటనలే జరిగాయి. అమీర్ ఖాన్ కు యాక్సిడెంట్ అయింది. 'మగధీర'కూ, 'గజనీ'కి ఓ ప్రధానమైన పోలిక కూడా ఉంది. ఈ రెండు చిత్రాలకూ నిర్మాత అల్లు అరవింద్. షూటింగ్ లో ప్రమాదాలు, ఆటుపోట్లు ఎదుర్కొని ఆనక సంచనల విజయం సాధించిన 'గజనీ' తరహాలోనే సెమీ-పీరియాడిక్ ఫిల్మ్ 'మగధీర' కూడా ఇప్పుడు సంచలనాలకు తెరతీయనుందా? ఇదే అంశం ప్రేక్షకులలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Be first to comment on this News / Article!
|