సిద్దార్ధ సెంటిమెంట్
కొత్త టాలెంట్ తో పనిచేయడం అంటే హీరో సిద్దార్ధ ఎక్కువ ఆసక్తి చూపుతుంటాడు. ముఖ్యంగా దర్శకుల విషయంలో. సిద్దార్ధకు దర్శకత్వం అంటే మహా మోజనీ, తాను పనిచేసే సినిమాల విషయంలో దర్శకుడి పనిలో చొరబడి తన మాట చెలామణీ చేయించుకుంటాడనీ ఆయనపై
తరచు వదంతులూ వినిపిస్తుంటాయి. అయితే ఇది జోక్యం కాదనీ, మంచి రిజల్ట్ కోసం సిద్దార్ధ పడే తాపత్రయంగానే అర్ధం చేసుకోవాలని సదరు దర్శకులు కితాబి ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. కొత్త దర్శకులతో పనిచేయడం ద్వారా గతంలో మంచి ఫలితాలను కూడూ సిద్దార్ధ సాధించారు. ప్రభుదేవా తొలిసారి దర్శకత్వం వహించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', భాస్కర్ తొలిచిత్రం 'బొమ్మరిల్లు' సిద్దార్ధ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లుగా నిలిచాయి. సిద్దార్ధ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమా కూడా దర్శకుడు కిషోర్ (డాలీ)కు మొదటి సినిమానే. తాజాగా సిద్దార్ధ ఇదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ కొత్త చిత్రాలకు కమిట్ అవుతున్నారు.
సిద్దార్ధ హీరోగా డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ప్రోగ్రస్ లో ఉంది. సిద్దార్ధకు జోడిగా ఒకప్పటి బాలనటి షామిలి ఇందులో నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆనంద్ అనే యువకుడు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఆసక్తికరంగా సిద్దార్ధ తన తదుపరి చిత్రాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ కు కమిట్ అయ్యారు. సిద్దార్ధ నటించిన 'కొంచెం ఇష్టం కష్టం' సినిమాతో సహా గతంలో పలు చిత్రాలకు కో-డైరెక్టర్ గా పనిచేసిన రాంబాబు ఈ కొత్త చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సో...దర్శకత్వం చేపట్టాలనుకునే కొత్త జనరేషన్ యువకులు మంచి కథతో సిద్దార్ధను అప్రోచ్ అయితే మంచిది.
Be first to comment on this News / Article!
|