ప్రేమకోసం ట్వంటీ-20
గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చిన్నా పెద్దా అంతా ఇష్టపడే గేమ్ క్రికెట్. ట్వంటీ-20 మ్యాచ్ లు వచ్చి క్రికెట్ కు మరింత ఆదరణ పెరిగింది. ప్రేమకోసం ట్వంటీ-20 మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుంది? తెలియాలంటే 'టిక్ టిక్ టిక్ ' సినిమా చూడాల్సిందేనని చిత్ర దర్శకనిర్మాత అరుణ్ కాంత్ అంటున్నారు. అరుణోదయ ఫిలిమ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది.
ఇందులోని కీలకమైన క్రికెట్ ఎపిసోడ్ అరుణ్ కాంత్ వివరిస్తూ 'శంకర్ దాదా అనే పేరుతో ఓ రౌడీ క్రికెట్ టీమ్ ఉంటుంది. ఆ టోమ్ కోచ్ భగవాన్ సింగ్ థోని. అతని శిష్యుడైన శంకర్ దాదా పెద్ద రౌడీ. అతను దీపిక పాడుకునే అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇదే అమ్మాయిని క్రికెట్ ప్లేయర్ యువరాజ్ చాంగ్ ప్రేమిస్తాడు. దీంతో తనకు క్రికెట్ నేర్పించి తన ప్రేమను గెలిపించమని భగవాన్ సింగ్ దోనిని శంకర్ దాదా కోరతాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి కోసం ప్రేమికులిద్దరి మధ్యా ట్వంటీ-20 క్రికెట్ మ్యాట్ జరుగుతుంది. మ్యాచ్ లో ఎవరు గెలుపొందారు. దిపికా పాడుకునే ఎవరికి దక్కిందనేది తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే' అన్నారు. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లరే అయినా క్రికెట్ నేపథ్యంలో వచ్చే కామెడీ ట్రాక్ బాగా వస్తోందని చెప్పారు. ఇందులో కోచ్ గా కృష్ణ భగవాన్, శంకర్ దాదాగా అరుంధతి శీను నటిస్తున్నారని తెలిపారు. ఈ నెలలోనే చివరి షెడ్యూల్ పూర్తి చేసి మార్చిలో ఆడియో, వేసవిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వేణుమాధవ్, సైరాభాను, షరీఫ్, ప్రేమ, అమృత, నర్సింగ్ యాదవ్ తదితరులు నటిస్తున్నారు. సీతారామరాజు మాటలు, రాంబాబు పాటలు, ఎస్.డి.జాన్ సినిమాటోగ్రఫీ, అనిల్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ , కానూరి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|