'యమలోకంలో శీనుగాడు'
'వినాయకుడు' చిత్ర హీరో కృష్ణుడు మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఆయన హీరోగా 'యమలోకంలో శీనుగాడు' అనే చిత్రాన్ని నిర్మాత కె.వి.రావు ప్రకటించారు. గతంలో ఆయన తెలుగులో 'దాదర్ ఎక్స్ ప్రెస్', 'అన్వేషణ', 'సర్కార్' వంటి చిత్రాలను నిర్మించారు. తన తాజా చిత్రం విశేషాలను ఆయన బుధవారంనాడు తెలియజేశారు.
కృష్ణుడు హీరోగా తాము నిర్మించనున్న చిత్రానికి కోడి రామకృష్ణను ఎంపిక చేశామనీ, సోషియో ఫాంటసీగా ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. ఈ చిత్రంలో గ్రాఫిక్ వర్క్ కు ఎంతో ప్రాధాన్యం ఉంటుందనీ, స్వర్గీయ ఎన్టీఆర్, ఎంజిఆర్ తదితరులు తెరపై కనిపించనున్నారనీ తెలిపారు. 'మమ్మీ', '300' వంటి చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయబోతున్నారని చెప్పారు. అలాగే తాము మంజుల, ఛార్మి నటించిన 'కావ్యాస్ డైరీ ' చిత్రం ద్వారా ఓవర్సీస్ డిస్ట్రిబూషన్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్టు చెప్పారు. ఇందుకోసం కామినీ మూవీస్ ఇన్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రారంభించామనీ, 'కావ్యాస్ డైరీ' చిత్రాన్ని అమెరికాలో 6 ప్రింట్లతో విడుదల చేయనున్నామనీ చెప్పారు. న్యూజెర్సీ, కాలిఫోర్నియాలో ప్రీమియర్ షో ఏర్పాటు చేసి ఛార్మిని అక్కడికి ఆహ్వానించనున్నట్టు తెలిపారు.
Be first to comment on this News / Article!
|