'తాజ్' నిర్మిస్తున్న శివాజీ
ఏడాది పొడవునా గణనీయమైన సినిమాల్లో నటిస్తున్న హీరో శివాజీ. లోబడ్జెట్ చిత్రాల హీరోగా అందరికీ అందుబాటులో ఉంటూ తన సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఇస్తున్నారు. 'అదిరిందయ్యా చంద్ర', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'మంత్ర' చిత్రాలు శివాజీ మార్కెట్ ను నిలబెట్టాయి. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూనే నిర్మాతగా కూడా మారబోతున్నట్టు సమాచారం. ఇందుకు తగ్గట్టే కన్నడంలో సూపర్ హిట్ అయిన 'తాజ్ మహల్' చిత్రాన్ని రీమేక్ చేసేందుకు హక్కులు తీసుకున్నట్టు తెలుస్తోంది.
అజయ్, పూజా గాంధీ జటంగా టీనేజ్ లవ్ స్టోరీతో కన్నడంలో రూపొందిన 'తాజ్ మహల్' చిత్రం అక్కడ 200 రోజులకు పైగా ప్రదర్శితమైంది. చంద్రు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అభిమాన్ అందించిన సంగీతం తోడై మ్యూజికల్ హిట్ గా నిలిచింది. నిజమైన ప్రేమ ఎలా ఉండాలనే కథాంశంతో హృదయాన్ని సూటిగా తాకే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు మలిచారు. రీమేక్ వెర్షన్ లో శివాజీ కథానాయకుడిగా నటించబోతున్నారు. చిత్రం కథాంశం, తన పాత్రనుదృష్టిలో పెట్టుకుని శివాజీ 6 కిలోల వరకూ తన బరువును తగ్గించుకుని స్లిమ్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మాత్రం బయటకు రాలేదు.
Be first to comment on this News / Article!
|