ఐదు భాషల్లో 'మల్లన్న'
స్టార్ హీరో విక్రమ్ 'మల్లన్న' గా సమ్మర్ సందడి సష్టించానికి సన్నద్ధమవుతున్నారు. 'అపరిచితుడు' వంటి సెన్సేషన్ హిట్ ఇచ్చిన విక్రమ్ ఈ చిత్రం కోసం ఏడాదిన్నరకు పైగా పనిచేశారు. సుశి గణేషన్ దర్శకత్వంలో కలైపులి థాను ఈ చిత్రాన్ని అత్యం భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించారు. విక్రమ్ కు జోడిగా శ్రియ నటించింది. తెలుగు, తమిళ (కందస్వామి) భాషలతో పాటు హిందీ, స్పానిష్, ఇటాలియన్ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. మే 1న 1500 ప్రింట్లతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సుశీ గణేషన్ తెలిపారు.
ఈ చిత్రంలో శ్రియ నటిస్తున్న సుబ్బలక్ష్మి పాత్ర ప్రత్యేక ఆకర్షణ కానుంది. అందం, డబ్బు పుష్కలంగా ఉన్న సుబ్బలక్ష్మి విదేశాల్లో చదవు ముగించుకుని ఇండియా వస్తుంది. అక్కడ పేదలు, ధనికుల మధ్య ఉన్న తారతమ్యం ఉన్నట్టు గ్రహిస్తుంది. ఇదే తరుణంలో మల్లన్నతో
పరిచయమవుతుంది. ఇద్దరి మధ్యా తలెత్తిన అభిప్రాయ భేదాలు క్రమంగా వారిని దగ్గరచేస్తాయి.సమాజంలోని పేద ధనిక వర్గాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించేందుకు ఆ ఇద్దరూ ఎలా పాటుపడ్డారన్నదే టూకీగా ఈ చిత్రకథ. విక్రమ్ ఈ చిత్రం కోసం బహు బాషా గాయకుడిగా కూడా మారడం విశేషం. తెలుగు, తమిళ భాషలతో పాటు, స్వానిష్, ఇటాలియన్ భాషలన్నిటిలోనూ తన పాటలను తానే పాడుకున్నారు. తెలుగు పాటలకు సంబంధించి దేవిశ్రీప్రసాద్, సాహితుల నుంచి శిక్షణ కూడా పొందారు. దీనికితోడు సినిమాలో 12 గెటప్ లలో కూడా విక్రమ్ కనిపించబోతున్నారు. నీగ్రో, స్వామిజీ, స్త్రీ వంటి వేషాలు ఇందులో ఉన్నాయి. 'మలన్న' సృష్టించబోయే సంచనాల కోస మే వరకూ వేచిచూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|