మార్చిలో'ఆకాశరామన్న'
అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల, మీరా జాస్మిన్, గౌరీ పండిట్ హీరోహీరోయిన్లుగా మన్యం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మన్యం రమేష్ నిర్మిస్తున్న చిత్రం 'ఆకాశ రామన్న'. ఆశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని మార్చి మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. గురువాంనాడు ఈ చిత్రం విశేషాలను మన్యం రమేష్ తెలియజేశారు.
పక్కా ప్లానింగ్ తో అనుకున్న సమయంలో సినిమా షూటింగ్ పూర్తయిందనీ, ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ చెప్పారు. కథకు తగిన మంచి ఆర్టిస్టులు దొరకడంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టామనీ, ఇది కాన్సెప్ట్ ప్రధానంగా సాగే చిత్రమనీ తెలిపారు. ఇటీవల కాలంలో కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారనీ, మంచి కాన్సెప్ట్ తో, కొత్త తరహా స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారనీ అన్నారు. నరేష్ చిత్రాల తరహాలోనే మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందన్నారు. మార్చి మూడో వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మధుశర్మ, నాగబాబు, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘుబాబు, రాజేష్, శ్రీనివాసరెడ్డి, రావు రమేష్, సన, గీతాసింగ్ తదితరులు నటిస్తున్నారు. చంద్రశేఖర్ మాలు, శ్రీరామ్ ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|