ఈ వయసులో ఆడియో రిలీజ్
పసుపులేటి ప్రొడక్షన్స్ పతాకంపై బి.రమేష్ రాయల్ దర్శకత్వంలో పసుపులేటి సుశీల్ కుమార్ నిర్మించిన ఈ వయసులో చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో శుక్రవారం రాత్రి జరిగింది. అడియోలోని ఒక్కో పాటను బ్రహ్మానందం, శ్రీను వైట్ల, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు ఆవిష్కరించారు. హాస్యనటుడు బ్రహ్మానందం అన్ని పాటలుగల ఆడియో క్యాసెట్లను, సీడీలను అతిథిగా పాల్గొన్న దర్శకుడు శ్రీను వైట్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైటిల్ చాలా ఆకర్షణీయంగా ఉందనీ, ఎవరికి వారు ఊహించుకునే విధంగా మంచి టైటిల్ ను పెట్టారన్నారు. ఈ చిత్ర దర్శకుడు రమేష్ రాయల్, అత్తిలిలో నేను లెక్చరర్ గా పనిచేసేటప్పుడు నా విద్యార్థనీ, అతను ఈ చిత్రం ద్వారా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని బ్రహ్మానందం అన్నారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ రమేష్ రాయల్ తో 15 సంవత్సరాలుగా పరిచయం ఉందనీ, ఈ చిత్రం వాల్ పోస్టర్లు చూస్తుంటే గతంలో నేను దర్శకత్వం వహించిన ఆనందం గుర్తుకు వస్తోందన్నారు. ఈ వయసులో చిత్రం కూడా ఆనందం మాదిరిగానే ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. దర్శకుడు రమేష్ రాయల్ మాట్లాడుతూ మూడు నెలలు కష్టపడి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, అందరి సహకారంతో ఈ సినిమాను నిర్మించామన్నారు. ఈ వేడుకలో చిత్ర హీరో సన్ని, హీరోయిన్ యామిని, సీనియర్ నటి గీతాంజలి, సంగీత దర్శకుడు శంభుప్రసాద్, సహ నిర్మాత భార్గవరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి.శాలిని తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|