విష్ణు, విరానికల వివాహం
మంచు వారింట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. డా.మెహన్ బాబు తనయుడుగా పరిశ్రమలోకి అడుగుపెట్టి, 'ఢీ' చిత్రం ద్వారా సక్సెస్ పుల్ హీరోగా పరిశ్రమలో నిలదొక్కుకున్న విష్ణువర్దన్ బాబు, విరానికల వివాహం ఆదివారంనాడు హైదరాబాద్ లోని గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10-13 గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి సోదరుడి కుమార్తె విరానిక, విష్ణువర్దన్ ల వివాహం ఆదివారం జరగనుంది. వీరిద్దరూ ప్రేమించుకోవడంతోపాటు పెద్దల అంగీకారం కూడా ఈ వివాహానికి తోడైంది. ఈ వివాహానికి పరిశ్రమ పెద్దలేకాక రాజకీయ ప్రముఖులూ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
Be first to comment on this News / Article!
|