శోభ సారీ చెప్పాలి : మా
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి జయసుధ మాట్లాడుతూ, రోజాపై శోభారాణి చేసిన వ్యాఖ్యలు చాలా షాక్ గురిచేశాయనీ, కళ్ల వెంబడ నీళ్ళు కూడా వచ్చాయన్నారు. కష్టపడి చదువుకుని న్యాయవాదిగా పైకెదిగిన ఓ మహిళ మరొక మహిళను అలా దూషించడం సమంజసం కాదని, ఈ విషయంలో చిరంజీవికూడా జోక్యం చేసుకుని ఆమె మాటలను ఖడించాలని ఆమె కోరారు. 'మేము ఏ పార్టీలో ఉన్నప్పటికీ, మా అందరికీ సినిమారంగం కుటుంబం లాంటిది. అందులో ఒక కన్ను చిరంజీవి అనుకుంటే ఇంకొక కన్ను రోజా. మీడియా కూడా టిఆర్ పీ రేట్ కోసం నీచంగా దిగజారాయనీ ఆమె అభిప్రాయపడ్డారు. మా సభ్యురాలు జీవిత మాట్లాడుతూ విమర్శలనేవి సర్వసాధారణం అయినప్పటికీ అవి మర్యాదను అందుకునేలా ఉండాలన్నారు. శోభారాణి చేసిన వ్యాఖ్యలు తమందరినీ ఎంతగానో బాధ పెట్టాయని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో మా ప్రధాన కార్యదర్శి ఆహుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కాగా మురళీమోహన్ ఈ అంశంపై దాసరి నారాయణరావు తోనూ, నాగబాబుతోనూ ఫోన్ లో మాట్లాడారు. రాజకీయ నాయకులు రాజకీయాల గుంరిచి ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ, సినిమావాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి విమర్శించడం మానుకోవాలని దాసరి నారాయణరావు హితవు పలికారు. కాగా ఇతర పార్టీల వాళ్ళు తమ కుటుంబంపై వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేసినా సహిస్తూనే వచ్చామని తామెప్పుడూ ఎదురు దాడికి దిగలేదని నాగబాబు వివరించారు. ఐతే సహనానికి కూడా హద్దు ఉంటుందని దానిని నసింపచేయడం ఎవరికీ సాధ్యం కాదనీ నాగబాబు స్పష్టం చేశారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|