చంద్ర మహేష్ 'సరే నీ ఇష్టం'
ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు భాగ్యరాజా తనయుడు శాంతన్ భాగ్యరాజా తెలుగులో పరిచయమవుతున్నారు. అతను హీరోగా రూపొందిన చిత్రానికి 'సరే నీ ఇష్టం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. శాంతన్ కు జోడిగా అంద్రైత నటిస్తోంది. 'ప్రేయసి రావే' ఫేమ్ చంద్ర మహేష్ ఈ చిత్రాన్ని పూర్ణ చంద్రా మూవీ మేకర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం
ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. విశ్వనాథ్ స్వామీజీ, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సంయుక్తంగా ఈ చిత్రం లోగోను ఆవిష్కరించారు. 'సరే నీ ఇష్టం' అని ఉన్న టీ షర్టులను సంగీత దర్శకుడు చక్రి ఆవిష్కరించారు. ఈ చిత్రానికి టైటిల్ ను సూచించిన అంజనీ ప్రసాద్ కు ఈ సందర్భంగా దర్శకనిర్మాత చెక్ ను బహుకరించారు.
శాంతన్ భాగ్యరాజా తొలిసారి తెలుగులో పరిచయమవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలనీ, టీమ్ లోని ప్రతి ఒక్కరికీ పేరు రావాలని ముఖ్య అతిథులు అభిలషించారు. ఈ చిత్రం దర్శక నిర్మాతగా తనకు చాలా సంతృప్తినిచ్చిందనీ, ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాననీ చంద్రమహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, ఎడిటర్ గౌతంరాజు, హార్సమన్ బాబు, కాదంబరి కిరణ్ కుమార్, ప్రభాకర్, ధనియేలే, గుండు సుదర్శన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|