కల్యాణ్ రామ్ తో హన్సిక
సిమ్లా యాపిల్ ను తలపించే హీరోయిన్ హన్సిక మూడు హిట్లతో ఇటీవల హ్యాట్రిక్ కూడా సాధించింది. 'దేశముదురు', 'కంత్రి', 'మస్కా' చిత్రాల తర్వాత హన్సిక ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. కోటి రూపాయలకు పైగా హన్సిక డిమండ్ చేస్తున్నందువల్ల నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారనే పుకార్లు కూడా తరచు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మంచి ఆఫర్లు వస్తే రెమ్యునరేషన్ విషయంలో తాను మరీ అంత స్ట్రిక్ట్ కాదని హన్సిక ఇటీవల వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ 'బిల్లా'లో దర్శకుడు మెహర్ రమేష్ రిక్వెస్ట్ మేరకు ఓ స్పెషల్ సాంగ్ లో ఆమె నర్తిస్తోంది. ఈ క్రమంలో హన్సిక అడిగిన రెమ్యునరేష్ ఇచ్చేందుకు అంగీకరించడం ద్వారా యువహీరో నందమూరి కల్యాణ్ రామ్ తన తాజా చిత్రానికి ఆమెను కథానాయికగా ఎంపిక చేశారు.
'అతనొక్కడే', 'హరేరామ్' వంటి రెండు హిట్ చిత్రాలను తన సొంత బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మిస్తూ నటించారు. ఆ చిత్రాల తర్వాత మళ్లీ తనే కథానాయకుడుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఓ కొత్త చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. ప్రస్తుతం హైద్రాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం ద్వారా నరేన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చక్కటి కథా కథనాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, హన్సిక రాకతో సినిమాకు అదనపు గ్లామర్ వచ్చిందనీ చెబుతున్నారు. ఆసక్తికరంగా ఎన్టీఆర్ హీరోయిన్లే కల్యాణ్ రామ్ తో జోడి కడుతున్నారు. ఎన్టీఆర్ 'యమదొంగ' తర్వాత ప్రియమణి కల్యాణ్ రామ్ 'హరేరామ్ 'లో చేసింది. 'కంత్రి'లో నటించిన హన్సిక ఇప్పుడు కల్యాణ్ రామ్ కొత్తి చిత్రానికి కమిట్ అయింది.
Be first to comment on this News / Article!
|