గమ్యం క్రిష్ 'వేదం'
తొలి సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకులు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అల్లరి నరేష్, శర్వానంద్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో రోడ్ సినిమాగా క్రిష్ తొలిసారి దర్శకత్వం వహించిన 'గమ్యం' అప్పట్లో కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ చిత్రం తర్వాత పలు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా వెంకటేష్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మించ తలబెట్టిన 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రానికి క్రిష్ కమిట్ అయ్యారు. యూత్ గొప్పనాన్ని తెలియజేసే కథాంశంతో ఏడాది పాటు క్రిష్ స్క్రిప్టు రచన చేశారు. అయితే హీరో, నిర్మాత మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో అంగీకారం కుదరలేదని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం వెనక్కి మళ్లింది. ఈ నేపథ్యంలో క్రిష్ ఇంకెంతకాలం ఎదురుచూడ దలచుకోలేదు. ఇందులో భాగంగానే ఆయన ఓ కొత్త ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నారు. 'వేదం' అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని కొత్త నటీనటులతో ఆయన తెరకెక్కించబోతున్నారు.
వెంకటేష్ కోసం తయారు చేసుకున్న కథాంశంతోనే ఈ సినిమా రూపొందనుందా, ఒకవేళ వెంకటేష్ స్పెషల్ ఎప్పియరెన్స్ ఇచ్చే అవకాశాలున్నాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వై.శోభనాద్రి, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు క్రిష్ పట్టుదలగా ఉన్నారు.
Be first to comment on this News / Article!
|