పెప్సీకి చరణ్, దీపిక
సమ్మర్ సీజన్ వస్తోందంటే శీతల పానీయాల పోటాపోటీ యుద్ధం షరా మామూలవుతుంటుంది. థమ్సప్ సంస్థ ఇప్పటికే తమ బ్రాండ్ ను ప్రిన్స్ మహేష్ బాబు చేతుల్లో ఉంచింది. దీంతో ప్రత్యర్థి శీతల పానీయాల సంస్థ పెప్సీ సైతం తమ ప్రొడక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ జనాలను సమ్మోహన పరచే యువకుడి కోసం అన్వేషణ జరిపి ఎట్టకేలకు రామ్ చరణ్ ను ఎంపిక చేసింది. శీతల పానీయాల బ్రాండ్ కు పనిచేస్తున్నట్టు రామ్ చరణ్ సైతం ధ్రువీకరించారు. ఆసక్తికరంగా ఈ పెప్సీ యాడ్ లో రామ్ చరణ్ సరసన హిందీ 'ఓం శాంతి ఓం' ఫేమ్ దీపిక పడుకొనే నటిస్తోంది. ఇటీవల ముంబైలో కొన్ని గంటల పాటు ఈ బ్రాండ్ షూటింగ్ లో దీపక- చరణ్ పాల్గొన్నట్టు సమాచారం.
ఆసక్తికరంగా మెగా ఫ్యామిలీ నుంచి శీతల పానీయాల బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న నాలుగో వ్యక్తి చరణ్ అవుతారు. చిరంజీవి థమ్సప్ కోసం చాలాకాలం పనిచేశారు. ఆయన తప్పుకోగానే ఆ అవకాశం మహేష్ ను వరించింది. ఇక పవన్ కల్యాణ్ 'పెప్సీ 'కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించగా, అల్లు అర్జున్ '7-అప్' కోసం పనిచేస్తున్నారు. స్టార్స్ గా బాగా గుర్తింపు వచ్చిన తర్వాతే మెగా ఫ్యామిలీ నటులు బ్రాండ్ అంబాసిడర్లయితే, చరణ్ ఒక్క సినిమాకే అరుదైన ఛాన్స్ అందిపుచ్చుకోవడం విశేషమనే చెప్పాలి.
Be first to comment on this News / Article!
|