ఎన్టీఆర్ 'ఎమ్మెల్యే '
ఎన్టీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా కొత్త అవతారం ఎత్తబోతున్నారు. అయితే ఎక్కడ్నించి పోటీ చేస్తున్నారు? నిజంగానే ఎమ్మెల్యే అవుతారా? అనే సందేహాలా అవసరం లేదు. ఎన్టీఆర్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించనున్న చిత్రానికి 'మంచి లక్షణాలున్నాయ అబ్బాయ్' (ఎం.ఎల్.ఏ.) అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఎన్టీఆర్ తో తాను నిర్మించనున్న చిత్రం ఈ ఏడాది మేలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నల్లమలుపు బుజ్జి తెలిపారు. ఆయన ఇటీవల నిర్మించిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో తన తదుపరి ప్రాజెక్ట్ ను ఆయన అనౌన్స్ చేశారు.
సీనియర్ హీరోలతో మల్టీ స్టారర్ చిత్రాలు తీయాలనే కోరిక తనకు బలంగా ఉందని ఆయన చెప్పారు. తాను తీసిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాన్ని 180 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాననీ, ప్రస్తుతం 80 సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందనీ చెప్పారు. త్వరలోనే అర్ధశతదినోత్సహాన్ని నిర్వహించబోతున్నట్టు తెలిపారు. పైరసీకి కళ్లం వేసేందుకు తాను తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇవ్వడం సినిమా సక్సెస్ కు దోహదపడిందన్నారు. తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో హరీష్ శంకర్ ('షాక్ ' ఫేమ్ ) దర్శకత్వంలో ఉండబోతోందనీ, మేలో సినిమాను సెట్స్ పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామనీ చెప్పారు. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి నాని నిర్మిస్తున్న 'అదుర్స్ ' (టైటిల్ ప్రకటించాల్సి ఉంది) చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత 'ఎమ్మెల్యే' మొదలవుతుంది.
Be first to comment on this News / Article!
|