పూరీ సినిమా జట్ స్పీడ్
కేవలం మూడు నాలుగు నెలల వ్యవధిలోనే జెడ్ స్పీడ్ లో సినిమాలు తీయడంలో పూరీ జగన్నాథ్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా ఆదిత్య రామ్ నిర్మించనున్న చిత్రాన్ని కొత్త చిత్రాన్ని కూడా అదే స్పీడ్ లో సెట్స్ కు తెచ్చి కంప్లీట్ చేయడానికి చిత్ర దర్శకుడు, సమర్పకుడు కూడా అయిన పూరీ జగన్నాథ్ పట్టుదలగా ఉన్నారు. ఈనెల 18 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత ఆదిత్యరామ్ తెలిపారు.
పూరీ జగన్నాథ్ ఈ చిత్రం కోసం అద్భుతమైన స్క్రిప్టు రెడీ చేశారనీ, సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ కలిసిన చిత్రమిదనీ నిర్మాత తెలిపారు. ప్రభాస్ బాడీలాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలుస్తుందన్నారు. పూరీ జగన్నాథ్ తో కలిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం సంతోషంగా ఉందనీ, ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోందనీ చెప్పారు. మిగిలిన ముఖ్య పాత్రలకు కూడా భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నట్టు వివరించారు. పూరీ మాట్లాడుతూ, ప్రభాస్ తో చేస్తున్న పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇదని చెప్పారు. ప్రభాస్ క్యారెక్టర్ డిఫరెంట్ స్టైల్ లో ఉంటుందన్నారు. ఆగస్టులో రిలీజ్ అయ్యేలా సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|