'ఆనందతాండవం' ట్రైలర్స్
తమన్నా ప్రధాన పాత్రలో ఆస్కార్ ఫిలింస్ పతాకంపై అగ్రనిర్మాత వి.రవిచంద్రన్ నిర్మిస్తున్న 'ఆనందతాండవం' చిత్రం ట్రైలర్స్ కు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని కేంద్రాల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందనీ, ఆడియెన్స్ స్పందన చూస్తుంటే తప్పకుండా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం పెరిగిందనీ ఆ చిత్ర నిర్మాత డి.సురేష్ తెలిపారు. తమన్నా, సిద్దార్ధ (నూతన పరిచయం), రుక్మిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్.మీడియా సంస్థ అధినేత్రి శోభారాణి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఆస్కార్ ఫిలింస్ బ్యానర్ నుంచి గతంలో తాము విడుదల చేసిన చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా మ్యూజికల్ హిట్ అవుతుందనీ, ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ శోభారాణి తెలిపారు. సోనీ బిఎంజి ద్వారా ఈనెల 13న ఆడియో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. మార్చి మొదటివారంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదలవుతుందన్నారు. ఈ చిత్రానికి సుజాత కథ, శశాంక్ వెన్నెలకంటి మాటలు, సుద్దాల అశోక్ తేజ-భువనచంద్ర-వనమాలి పాటలు, జీవాశంకర్ సినిమాటోగ్రఫీ, పద్మశ్రీ తోట తరణి కళాదర్శకత్వం, వి.టి.విజయన్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|