ఈనెలలోనే ప్రేమ 'జల్లు'
చదువు పూర్తి చేసుకుని హ్యాపీగా తిరుగుతున్న అబ్బాయి జీవితంలో ఓ అమ్మాయి ప్రవేశించిన తరువాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రం 'జల్లు'. జయంత్ రేచర్ల, ప్రేరణ హీరోహీరోయిన్లుగా నటించారు. రేచర్ల మూవీ క్రియేషన్స్ పతాకంపై రేచర్ల సుభాష్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. వి.వి.నారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. హైద్రబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో మంగళవారంనాడు ఆ విశేషాలను చిత్ర యూనిట్ తెలియజేసింది.
నేటి కాలానికి తగినట్టుగా చక్కటి ప్రేమ కథా ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు దర్శకుడు నారాయణ తెలిపారు. పాత, కొత్త తారల సమ్మేళనంలో, అందరి సహకారంతో అనుకున్నది అనుకున్నట్టుగా ఈ చిత్రాన్ని బాగా తీశామని చెప్పారు. నిర్మాత సుభాష్ నాయుడు మాట్లాడుతూ, గతనెల 22న ఆడియో విడుదల చేశామనీ, అమ్మకాలు బాగున్నాయంటూ తిరుపతి, విజయవాడ, నెల్లూరు వంటి పలు ప్రాంతాల నుంచి ఫోన్లు వచ్చాయనీ చెప్పారు. తొలి పాటతో పాటు మిగిలిన పాటలు కూడా బాగున్నాయంటూ మంచి టాక్ వచ్చిందని చెప్పారు. సినిమా కూడా శరవేగంగా నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుతున్నామనీ, ఇదే నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ తెలిపారు. ఇందులోని ఆరు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు సంగీత దర్శకుడు నీహాల్ చెప్పగా, హీరో స్నేహితులుగా తాము మంచి
పాత్రలు పోషించామని ధనరాజ్ , చంటి తెలిపారు.
Be first to comment on this News / Article!
|