ఉగాదికి ఛార్మి 'మనోరమ'
ఛార్మింగ్ నటి ఛార్మికి ఇప్పుడు ఏ సరైన హిట్ కావాలి. 'మంత్ర'తో మంచి హిట్ కొట్టిన ఛార్మికి ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. ఈమధ్యనే వచ్చిన '16 డేస్' ఫ్లాప్ కావడం, వేణుతో కలిసి నటించిన 'మాయగాడు' చిత్రం థియేటర్ల ముందుకు ఇంకా రాకపోవడంతో ఇప్పుడు ఛార్మి ఓ సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ఛార్మి మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మనోరమ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'మీ శ్రేయోభిలాషి' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఈశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. జీ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఈనెల 27న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.
నేటి సమాజంలో మనకు తారపడే సహజమైన పాత్రలతో ఈ చిత్రం రూపొందిందనీ, టైటిల్ పాత్రలో ఛార్మి అభినయం సినిమాకి హైలైట్ అనీ ఈశ్వర్ రెడ్డి తెలిపారు. ఛార్మి ఇందులో సమాజానికి మేలు చేసే అమ్మాయి పాత్రలో నటిస్తోందనీ, ఒక ఫీల్ గుడ్ మూవీని చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందనీ అన్నారు. నానక్ రామ్ గూడలోని రామానాయుడు సినీ విలేజ్ లో 35 లక్షలతో ఏర్పాటు చేసిన సెట్ లో ఎక్కువ భాగం షూటింగ్ జరిపినట్టు చెప్పారు. త్వరలోనే ఆడియో, ఉగాదికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నిశాంత్, ఆలీ, ఎంఎస్ నారాయణ, లహరి, ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. పద్మశ్రీ కథ-మాటలు, కోటి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|