శ్రద్ధాదాస్ బర్త్ డే
'సిద్దు ఫ్రమ్ సికాకుళం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన శ్రద్ధాదాస్ బుధవారంనాడు తన బర్త్ డే వేడుకను హైద్రాబాద్ లో జరుపుకొంది. జగపతిబాబు కథానాయకుడిగా సముద్ర దర్శకత్వంలో శరవేగంగా రూపొందుతున్న 'అధినేత' చిత్రం షూటింగ్ లో ప్రస్తుతం శ్రద్ధాదాస్ పాల్గొంటోంది. బోయనపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో పెళ్లికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రద్ధాదాస్ పుట్టినరోజు విషయం తెలుసుకున్న నిర్మాత కె.రాధామోహన్ కేక్ తెప్పించారు. శ్రద్ధాదాస్ కేట్ కట్ చేసి తన సంతోషాన్ని యూనిట్ సభ్యులతో పంచుకుంది. జగపతిబాబు, సముద్ర, కె.రాధామోహన్, ఆహుతి ప్రసాద్, హంసానందిని, అన్నపూర్ణ తదితరులు ఆమెకు పుట్టినరోజు శుక్షాకాంక్షలు తెలిపారు.
ఆత్మీయులైన యూనిట్ సభ్యుల అందిరి మధ్యా తన పుట్టినరోజు వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని శ్రద్ధాదాస్ పేర్కొంది. ఆమె నటించిన 'టార్గెట్ ' చిత్రం విడుదల కావలసి ఉండగా, 'అధినేత' ఎన్నికల ముందు విడుదలకు సిద్ధమవుతోంది.
Be first to comment on this News / Article!
|