ఎన్నికల ముందు 'అధినేత'
రాజకీయ కథాంశంతో జగపతిబాబు కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్ పతాకంపై కె.రాధామోహన్ నిరిస్తున్న చిత్రం 'అధినేత'. వి.సముద్ర దర్శకుడు. శ్రద్ధాదాస్, హంసానందని హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్నికల ముందు రిలీజ్ ను టార్కెట్ గా చేసుకుని ఈ చిత్రంశరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. బోయినపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో పెళ్లికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ బుధవారంనాడు జరుగుతోంది. హీరోహీరోయిన్లతో పాటు, ముఖ్య తారాగణం, పలువురు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. లొకేషన్ లోనే చిత్రం ప్రోగ్రస్ ను యూనిట్ తెలియజేసింది.
జగపతిబాబు మాట్లాడుతూ, ఇందులో రాజకీయనాయకుడి పాత్రలో తాను నటిస్తున్నాననీ, ఇంతవరకూ ఇలాంటి పాత్రను తాను పోషించలేదనీ చెప్పారు. కథలో మంచి ఫ్యామిలీ డ్రామా కూడా మిళితమై ఉంటుందన్నారు. నిజమైన ప్రజా ప్రతినిధులు ఎలా ఉండాలన్నది ఈ చిత్రంలో చూపిస్తున్నారని అన్నారు. జగపతిబాబు కెరీర్ లో ఇది ఓ ల్యాండ్ మార్క్ చిత్రమవుతుందనీ, అండర్ కరెంట్ గా ఒక సందేశం కూడా సినిమాలో ఉంటుందనీ సముద్ర తెలిపారు. శ్రద్ధాదాస్, హంసా నందిన బాగా నటిస్తున్నారనీ, హంసానందినికి ఫైట్స్ కూడా ఉన్నాయనీ చెప్పారు. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయనున్నట్టు నిర్మాత రాధామోహన్ తెలిపారు. ఖమ్మంలో పదిరోజుల పాటు క్లైమాక్స్ సన్నివేశాలు, విదేశాల్లో మూడు పాటల చిత్రీకరణ ప్లాన్ చేసినట్టు చెప్పారు. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయనీ, త్వరలోనే ఆడియో విడుదల చేసి, ఎన్నికల ముందు ఏప్రిల్ 10న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా నటీనుటుల అన్నపూర్ణ, శివపార్వతి, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, అనంతరాజ్ , శ్రద్ధాదాస్, హంసానందిని పాల్గొన్నారు. ఇదే సెట్స్ లో శ్రద్ధాదాస్ కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుక కూడా జరుపుకొంది.
Be first to comment on this News / Article!
|