ఒకే ఒక్కడు శివాజీ
హీరో శివాజీకి పోటీ లేదు. ఒకే ఒక్కడుగా ఆయన ఈ శుక్రవారం ప్రేక్షకుల తీర్పు కోసం ముందుకు వస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన 'నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్' చిత్రం ఇతర చిత్రాల నుంచి ఎలాంటి పోటీ లేకుండా సింగిల్ గా బరిలోకి దిగుతోంది. 'మంత్ర' చిత్రం తర్వాత సరైన సక్సెస్ లేని శివాజీకి ఈ సినిమా ఫలితం కీలకం కాబోతోంది. ఇదే సమయంలో ఈ చిత్ర కథానాయిక కావేరీ ఝా సైతం ఈ చిత్రం ఫలితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎ.నాగేంద్రకుమార్ దర్శకత్వంలో కె.బి.సినిమా పతాకంపై కుమార్ బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
'నగరం' చిత్రం తర్వాత కావేరీ ఝా ఎన్నో హోప్స్ తో నటించిన ఈ చిత్రంలో ఆమె రిచ్ గాళ్ గా గ్లామర్ తో కూడిన పెర్ ఫారమెన్స్ నటన ప్రదర్శించిందనీ, శివాజీ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తే, మైక్ టైసన్ గా బ్రహ్మానందం పాత్ర కడుపుబ్బ నవ్విస్తుందనీ, 'మంత్ర' ఆనంద్ సంగీతం మరో హైలైట్ అనీ దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఇక పబ్లిసిటీ పరంగానూ కావేరీ ఝాపైనే నిర్మాతలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. సినిమాలోని రెయినీ సాంగ్స్ ట్రైలర్స్ ఇప్పటికే ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. నిజానికి దాసరి ప్రిస్టేజియస్ మూవీ 'మేస్త్రి' కూడా ఈనెల 6న విడుదలవుతున్నట్టు ప్రకటించి ఆ తర్వాత 11వ తేదీకి మళ్లింది. దీంతో 'నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్'కి పోటీ లేదు. ఎటొచ్చీ ప్రేక్షకులు ఏమేరకు పట్టం కడతారనేది చూడాలి.
Be first to comment on this News / Article!
|