'వెండి తాపడాలు' ప్రదానం
విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువుతీరిన మల్లేశ్వర స్వామి ఆలయ ద్వారాలు వెండి వెలుగులు సంతరించుకున్నాయి. శతాధిక చిత్రాల నిర్మాణ డాక్టర్ డి.రామానాయుడు 7 లక్షల రూపాయల వ్యయంతో 26.5 కేజీల వెండితే శివాలయం తలుపులకు వెండి తాపడం చేయించారు. దేవతా మూర్తులతో కూడిన ఈ వెండి రేకులను ఆలయ ఇ.ఓ. చంద్రకుమార్ కు రామానాయుడు అప్పగించారు. వైదిక కమిటీ సభ్యులు రంగావజ్ఞలు శ్రీనివాస శాస్త్రి, కోట ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేయించి మల్లేశ్వర స్వామి ఆలయ ద్వారాలకు బిగించారు. ఇ.ఇ.కోటేశ్వరరావు, పి.వి.సాయిబాబు, సి.సి.సుబ్రమణ్యం ఈ సందర్భంగా పాల్గొన్నారు.
రామానాయుడు ఈ వెండి తాపడాలను తెనాలిలో చేయించారు. 2001లో ఆయన ఇంద్ర కీలాద్రిపై కనకదుర్గమ్మ వారి ఆలయ తలుపులకు కూడా 40 కిలోల వెండి తాపడాలను బహూకరించారు. మానవ సేవే మాధవ సేవ అనే ఆర్యోక్తిని అనుసరిస్తూ ఓల్డేజ్ హోమ్ వంటి ప్రజోపకరమైన కార్యక్రమాలకు సహాయపడుతూ, పలు విద్యా సంస్థలకు కూడా ఆయన ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|