ఎమ్మార్వీ ప్రసాద్ కుమార్తె పెళ్లి
ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ తోడల్లుడు, 'బాలగోపాలుడు', 'సుల్తాన్', 'అల్లరి పిడుగు' వంటి భారీ చిత్రాల నిర్మాత నిర్మాత (పిబిఆర్ట్స్ అధినేత) ఎం.ఆర్.వి.ప్రసాద్ కుమార్తె ఉమ వివాహం హైద్రాబాద్ లో కన్నుల పండువగా జరిగింది. గురువారం ఉదయం 7.28 నిమిషాలకు శిల్పకలా వేదికలో ఉమ వివాహం కొల్లారెడ్డి రాఘువరెడ్డి, రంగనాయకమ్మల కుమారుడు రామచంద్రతో జరిగింది.పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు.
బాలకృష్ణ, మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జానారెడ్డి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డాక్టర్ మోహన్ బాబు, కల్యాణ్ రామ్, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, ఎం.బాలయ్య, నందమూరి మోహన కృష్ణ, నందమూరి రామకృష్ణ తదితర ప్రముఖలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Be first to comment on this News / Article!
|