ఒకరోజు లేటుగా 'మేస్త్రి'
దర్శకరత్న దాసరి నారాయణరావు దాదాపు ఐదేళ్ల తర్వాత నటిస్తున్న 'మేస్త్రి' చిత్రం మరో రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలుత ఈ చిత్రాన్ని ఈనెల 6న విడుదల చేస్తున్నట్టు ప్రచారం చేసినప్పటికీ చివరకు 11వ తేదీ ఖరారైంది. అయితే తాజాగా మరో రోజు ఆలస్యం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఆ ప్రకారం ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతుంది. పబ్లిసటీ పరంగా ఇచ్చిన యాడ్స్ లోనూ 12వ తేదీనే అనౌన్స్ చేశారు.
ఇది రాజకీయ వ్యంగ్య చిత్రమని మొదట్నించీ ప్రచారం జరగడం, ఎన్నికల తరుణంలో విడుదలవుతుంటడం సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతూ వచ్చింది. ఇందుకు తగ్గట్టే పలు ప్రపంచ దేశాల్లో సైతం ఈ చిత్రం ఆడియో విడుదల కావడం, పది రూపాలయకే సీడీ ఆందుబాటులోకి రావడంతో 3.5 లక్షలకు పైగా అమ్ముడుపోవడం సినిమాపై మరింత అంచనాలు పెంచింది. సమకాలీన రాజకీయ స్థితిగతులకు ఈ చిత్రం అద్దం పడుతుందని దాసరి చెబుతున్నారు. ఎవరినీ ఉద్దేశించి ఈ సినిమా తీయలేదనీ, ఎవరిపైనా విమర్శలు ఉండవనీ ఆయన భరోసా ఇస్తున్నారు. ఈ చిత్రంలో డాక్టర్ మోహన్ బాబు 'మేజర్ దేవరాజు' గా ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, మరో ముఖ్య పాత్రను డాక్టర్ శ్రీహరి పోషిస్తున్నారు. శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు.
Be first to comment on this News / Article!
|