సాయాజీ సెల్ మాయం!
చేతిలో ఇమిడే సెల్ చేజారితే మళ్లీ దొరకడం కష్టం. అయినా ఒక్కసారైనా మొబైల్ పోగొట్టుకోని వాళ్లని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. విలనీ పాత్రల నుంచి క్యారెక్టర్ పాత్రల వరకూ ఆలవోకగా పోషించగలిగిన సాయాజీ షిండే ఈమధ్యన తీవ్రంగా అప్సెట్ అయ్యారు. వేషాలు తగ్గడమో, నిర్మాతలు ఇవ్వాల్సిన సొమ్ము అందకపోవడమో ఇందుకు కారణం కాదు. ఎంతో ఇష్టపడి కొనుకున్న అత్యాధునిక మొబైల్ ఫోన్ కనడకకుండా పోవడమే కారణం. విశాల్ కథానాయకుడుగా రూపొందుతున్న ద్విభాషా చిత్రం షూటింగ్ లో పాల్గొన్నప్పుడు సందిట్లో సడేమియా అంటూ ఎవరో ఆయన మొబైల్ చక్కబెట్టేశారు.
సెట్స్ లో ఒక మూల రీచార్జ్ కోసం మొబైల్ ను ఉంచారనీ, కొద్ది సేపటికి చూసుకుంటే అది మాయమైందనీ యూనిట్ వర్గాలు తెలిపాయి. పోయిన సెల్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సాయాజీ తీవ్ర మనస్థానం చెందారట. అయితే అంత బాధలోనూ ఆయన ఆరోజు పనచేయాల్సిన షూటింగ్ ను సజావుగా ముగించుకుని వెనుదిరిగారట. సాయాజీ ఈమధ్యనే 'అరుంధతి' చిత్రంలో ముస్లిం పకీరుగా
చేసిన నటనకు అరుదైన ప్రశంసలు కూడా లభించాయి. సాయాజీ కెరీర్ లోనే ఈ పాత్ర హైలైట్ అనీ, ఈసారి బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్టుగా అవార్డులు ఎగురేసుకుపోవడం ఖాయమంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|