'స్లమ్ డాగ్' లోకల్ టాలెంట్
ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించి రెహ్మాన్ కు రెండు, రసూల్ పూకుట్టికి ఒక ఆస్కార్ అవార్డుతో సహా మొత్తం 8 అవార్డులను సొంతం చేసుకున్న 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి మన హైదరాబాదీ యువకుడు కూడా పనిచేయడం ఓ విశేషం. ఆ లోకల్ టాలెంట్ పేరు దుర్గా కిషోర్ కుమార్. ఈ చిత్రానికి ఫోకస్ పుల్లర్ గా, సెకెంట్ యూనిట్ కెమెరా అసిస్టెంట్ గా ఆయన పనిచేశారు. ఈ చిత్రానికి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.
హైదరాబాద్ రవిప్రసాద్ యూనిట్ లో కెమెరా అసిస్టెంట్ గా పనిచేసిన తాను ఆంధోని దోడ్ మాటింక్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సక్సెస్ అయి 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి ఫోకస్ పుల్లర్ గా, సెకెండ్ యూనిట్ కెమెరా ఆసిస్టెంట్ గా పనిచేసినట్టు చెప్పారు. ముంబై, ఆగ్రా, గోవా, ఊటీ, రాజస్థాన్, జైపూర్, సిమ్లా తదితరల ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిపినట్టు చెప్పారు. చిత్ర దర్శకులు డానీ బోయిల్, సినిమాటోగ్రాఫర్ ఆంధోని దోండ్ మాంటెక్ తనకు ఇచ్చిన సలహాలు, సూచనలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయనీ, వారితో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమనీ సంతోషం వ్యక్తం చేశారు. తన పనితీరు నచ్చి వారిరువురూ ఎంతగానో ప్రోత్సహించే వారనీ, 'స్లమ్ డాగ్ మిలయనీర్ ' తర్వాత మరో ఇంగ్లీషు చిత్రానికి, రెండు హిందీ చిత్రాలకూ పనిచేశాననీ, ప్రస్తుతం మరో ఆంగ్ల చిత్రానికి పనిచేస్తున్నాననీ వివరించారు. తనను ఎంతగానో ప్రోత్సహించిన డానీ బోయిల్, డాడ్ మాంట్ తో సహా, తనతో కలిసి పనిచేసిన స్వదేశీ, విదేశీ టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Be first to comment on this News / Article!
|