రజనీ 'రోబో' సాంగ్ ఇక్కడే
'శివాజీ' (ది బాస్) వంటి సెన్సేషన్ హిట్ తర్వాత రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న'యంతరిన్' (రోబో) చిత్రం పబ్లిసిటీకి దూరంగా శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. 140 కోట్ల భారీ బడ్జెట్ అంచనాలతో ఈ చిత్రం రూపొందుతుండటం, శంకర్ కు ఇది చాలాకాలంగా మనసులో ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో సహజంగానే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ గా భారీ టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సన్ టీవీ నెట్ వర్క్ లిమిటెడ్ గ్రూప్ నకు చెందిన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శంకర్ తరహాలో అత్యంత రిచ్ గా ఉండే ఈ చిత్రం టైటిల్ సాంగ్ ను త్వరలోనే హైద్రాబాద్ లో చిత్రీకరించబోతున్నారు.
కథానాయిక ఐశ్వర్యారాయ్ హీరో రజనీకాంత్ పై తన ప్రేమను వ్యక్తం చేసే సాంగ్ గా అత్యంత స్టయిలిష్ గా, భారీ ఖర్చుతో చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్ లో వెండి రంగులో ఉండే 'రోబో' కాస్ట్యూమ్స్ ధరించిన 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పొల్గొనబోతున్నారు. ఈ చిత్రం అత్యంత కాస్ట్ లీ సాంగ్ ఇదేనని తెలుస్తోంది. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఇటీవలే ఈ పాటను రికార్డు చేశారు. మధుశ్రీ నేపథ్యగానం అందించారు. హైద్రాబాద్ లోని ఓ స్టూడియోలో ఈ సాంగ్ చిత్రీకరణ కోసం కళాదర్శకుడు సిబు సైరల్ నేతృత్యంలో ఓ భారీ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. 2009 చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Be first to comment on this News / Article!
|