కమల్ 'వెన్స్ డే'కి మరోచిక్కు
'మర్మయోగి' చిత్రం ప్రారంభానికి నోచుకోకుండా మూలనపడటంతో కమల్ హాసన్ ఆశలన్నీ 'ఎ వెన్స్ డే' రీమేక్ పైనే ఉన్నాయి. నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నీరజ్ పాండే దర్శకత్వంలో హిందీలో వచ్చిన 'ఎ వెన్స్ డే' చిత్రం ప్రేక్షకుల ఆదరణ చూరగొంది. యుటీవీతో కలిసి ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు వెర్షన్లలో నిర్మించేందుకు కమల్ కొద్దికాలంగా సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్ లో కమల్ తో పాటు మరో కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ కూడా నటించే అవకాశాలున్నాయి. అయితే ఈ చిత్రం హక్కుల విషయంలో తెలుగు నిర్మాత కోనేరు కిరణ్ కుమార్ నుంచి తొలుత ప్రతిఘటన ఎదురైంది. యుటీవీ నుంచి తెలుగు రీమేక్ హక్కుల కోసం తాను అడ్వాన్స్ చెల్లించాననీ, ఇప్పుడు వేరే వాళ్లకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం సరైంది కాదంటూ ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. అడ్వాన్ చెల్లించిన ఆధారాలను కూడా ఆయన కోర్టుకు సమర్పించారు. ఈ మధ్యనే ఈ సమస్య కోర్టు బయటే సామరస్య పూర్వకంగా పరిష్కారమైందంటూ అనధికార సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో సమస్య తలెత్తింది. హిందీ వెర్షన్ సమర్పకులైన యూటీవీకీకి ఆ చిత్ర ఒరిజనల్ నిర్మాతలైన హిందీ ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్ ఓ లీగస్ నోటీసు పంపింది. చిత్ర నిర్మాణం, మార్కెటింగ్ విషయంలో ఇరు పార్టీల మధ్య కుదిరిన ప్రొడక్షన్ అగ్రిమెంట్ ను యూటీవీ ఉల్లంఘించిందనంటూ హిందీ ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్ ఆరోపించింది.
అగ్రిమెంట్ ఉల్లంఘనకు పాల్పడినందున యూటీవీని తప్పిస్తూ తాము లీగల్ నోటీసు పంపినట్టు ముంబై పత్రికల్లో ఒక పబ్లిక్ నోటీసు కూడా నిర్మాతలు ప్రచురించారు. దీంతో 'ది వెన్స్ డే' ఒరిజనల్ నిర్మాతలైన ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్ తో యూటీవీ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో తమిళ రీమేక వెర్షన్ ప్రారంభం కావడం కష్టం అవుతుంది. ఫలితంగా ఒక కష్టం వెనుక మరో కష్టం కమల్ కు తప్పడం లేదు.
Be first to comment on this News / Article!
|