'సమర్ధుడు' ఆడియో రిలీజ్
కృష్ణంరాజు, రాజా, సంజన ప్రధాన పాత్రల్లో దేవీ ప్రొడక్షన్స్ , ఆరంజ్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'సమర్ధుడు'. అర్జున్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగింది. కృష్ణంరాజు దంపతులు, ఎమ్మెల్యే సాయన్న, సీనియర్ దర్శకుడు బి.గోపాల్, ఎపిపిఎస్ సి చైర్మన్ వెంకట రామిరెడ్డి, జె.ప్రతాప్, కూచిపూడి వెంకట్, ఎంఎల్ సి యాదగిరి, శర్వానంద్, హేమ, ఉండా రాజేశ్వరి గుప్తా, పేర రామసుబ్బారెడ్డి, శ్రీనివాస్ వల్లూరి, ఎన్.వినయరెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వి.రాజశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో సీడీని కృష్ణంరాజు ఆవిష్కరించి బి.గోపాల్ కు అందజేశారు. ఆడియో క్యాసెట్ ను వెంకట రామిరెడ్డి ఆవిష్కరించి హీరో రాజాకు అందజేశారు.
కృష్ణంరాజు మాట్లాడుతూ, దర్శకుడు ఈ చిత్ర కథను సంభాషణలతో సహా వినిపించినప్పుడు నా భార్య కూడా నాపక్కనే ఉందనీ, ఇద్దరికీ బాగా నచ్చడంతో పాటు తప్పనిసరిగా మీరు ఆ పాత్ర చేయాలని నా శ్రీమతి సూచించిందనీ తెలిపారు. అలాగే సినిమా సంగీతం కూడా బాగు నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు అంగీకరించానని చెప్పారు. ఈ చిత్రం తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి యూనిట్ కు పేరు తెచ్చిపెట్టాలని వక్తలంతా అభిలషించారు.
Be first to comment on this News / Article!
|